Episode's summary
బాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు.. ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే, అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే, తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేలినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పడే.
బాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు.. ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే, అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే, తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేలినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పడే.
Episodes
యుద్ధంలో సామాన్యుడి ఓటమి
Listenedబాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు.. ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే, అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే, తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేలినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పడే.
మీరు స్టారా? -5 స్టారా ?? ఇది వింటే మీకే తెలుస్తుంది....
Listenedఎన్నింటికో మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఉంటాం. ఫుడ్ డెలివరీ బాయ్ కి ఇస్తాం , ఏదైనా ప్రోడక్ట్ కొంటె దానికి ఇస్తాం,లేదంటే ఎదో ఒక సర్వీస్ నచ్చితే ఇస్తూ ఉంటాం. మరి మీకు మీరుగా ,మీ జీవితానికి మీరిచ్చుకునే రేటింగ్ ఎంతా.... ఒక్కసారి ఆలోచించండి.
ఎన్నికలు బాబోయ్ ఎన్నికలు
Listenedఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు.
అనుభవమే అన్ని నేర్పిస్తుంది.....
Listenedఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.
చెరగని యశస్వి -కళా తపస్వి
Listenedతెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. చక్కటి సామాజిక స్పృహ, మూర్తీభవించిన మానవతా విలువలతో తెలుగు సినిమాకు ఓ ప్రబంధ గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్. తెలుగు సినీ చరిత్రలో ఆయనది సువర్ణాధ్యాయం. సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా కె. విశ్వనాథ్ సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు ఆచంద్రతారార్కం ప్రభవిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాల ద్వారా చాటిన విలువలు రాబోవు తరాల్ని కూడా ప్రభావితం చేస్తాయి